BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
విద్యార్థుల బర్త్ డే పార్టీ : 'పోలీసు సైరన్ విని భయంతో పరుగులు, ఇద్దరు విద్యార్థుల మృతి’ - అసలేం జరిగింది?
''రాత్రివేళ పోలీసులు గస్తీ కాస్తుంటారు. పెట్రోలింగ్ వాహనం రోడ్డుపై సైరన్ మోగించుకుంటూ అటుగా వెళుతోంది. అది విని పార్టీ చేసుకుంటున్న విద్యార్థులు భయంతో పరుగులు పెట్టారు'' అని మొయినాబాద్ ఇన్స్పెక్టర్ చెప్పారు.
లైవ్ , SIRలో తొలగించిన పేర్లున్న భారీ బ్యానర్‌తో ర్యాలీకి హాజరైన కార్యకర్తలు
సర్ ప్రక్రియలో ఓటర్ల జాబితా నుంచి తొలగించిన పేర్లు ముద్రించిన బ్యానర్లతో కొంతమంది కార్యకర్తలు నిరసన ప్రదేశానికి చేరుకున్నారు .
రూ. 450.42 కోట్ల భారీ ధరకు అమ్ముడుపోయిన డైనోసార్ అస్థిపంజరం... ఏమిటి దీని ప్రత్యేకత?
అంత భారీ ధర చెల్లించే సామర్థ్యం ఉన్న మ్యూజియం లేదా విశ్వవిద్యాలయం నాకు తెలియదు. మోనాలిసా చిత్రాన్ని ఒక ధనవంతుడు వ్యక్తిగతంగా సొంతం చేసుకుని, ప్రజలకు చూపించకుండా ఉంచితే ఎలా ఉంటుందో ఊహించండి. ప్రజలు దాన్ని చూడలేరు, ఆస్వాదించలేరు"
దిల్లీ: రామ్‌లీలా మైదాన్ వద్ద నేడు ప్రతిపక్షాల ర్యాలీ.. దిల్లీలో పరిస్థితిని చూపే 9 ఫోటోలు..
ర్యాలీ నేపథ్యంలో భద్రతా బలగాల మోహరింపు, సభా ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లకు సంబంధించిన ఫోటోలు ఇవి.
రామ్‌లీలా: కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఇక్కడ చేస్తున్న ఆందోళన లక్ష్యం ఏంటి? బీజేపీ ఏం చేస్తోంది?
ఈ ర్యాలీ కోసం వివిధ రాష్ట్రాల నుంచి కార్యకర్తలను దిల్లీకి తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ ఏర్పాట్లు చేసింది. విద్యార్థులు, సామాజిక సంస్థల ప్రతినిధులు సహా పలువురు ర్యాలీలో పాల్గొనాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.
సంక్షోభాలు వస్తే ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎలా సిద్ధమవుతున్నారు? ఏం చేస్తున్నారు?
ముప్పై ఏళ్ల ఆండ్రియాస్‌కు అత్యవసర పరిస్థితుల కోసం వస్తువులు దాచాలనే ఆలోచన ఎప్పుడూ రాలేదు. కానీ రెండేళ్ల క్రితం ప్రభుత్వం ఒక పుస్తకం ఆయన ఇంటికి పంపింది. దాని తర్వాత ఆయన ఆలోచన మారింది.
‘భారత్‌లో పేదరికం తగ్గింది, కానీ..’
"భారత్‌లో ప్రజల ఆదాయాలకు సంబంధించి అసలు సర్వేలే నిర్వహించడం లేదు. మన దేశంలో ఆర్థిక అసమానతలు చాలా తీవ్రమైన సమస్య. అది మరింత తీవ్రమైంది. మనం దీనిని నిర్లక్ష్యం చేయకూడదు" అని నిపుణులు అంటున్నారు.
రాప్తాడు: తరగతి గదిలోకి వచ్చి రంపంతో విద్యార్థినిపై దాడి.. అసలేం జరిగింది?
తరగతి గదిలో పాఠాలు జరుగుతున్న సమయంలోనే ఓ వ్యక్తి లోపలికి ప్రవేశించి విద్యార్థినిపై దాడికి పాల్పడ్డారు. ఆమెను రక్షించేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థిని కూడా గాయపడ్డారు. రాప్తాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ ఘటన జరిగింది.
ఇంటి నుంచి బయలుదేరి మూడు దశాబ్దాలు, కాలినడకనే ఖండాలు దాటిన సాహసికుడు
"వ్యక్తిగతంగా నేను మనుషుల్లోని అత్యుత్తమ లక్షణాలను చూశాను. అది నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. మానవత్వంపై నా నమ్మకాన్ని మరింత బలపరిచింది. అపరిచితులు చూపిన దయ వల్లే నా ప్రయాణం సాధ్యమైంది. ప్రపంచం సహకారం లేకపోతే నేను ఈ ప్రయాణాన్ని పూర్తి చేయలేకపోయేవాడిని"
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
ఫీచర్లు
‘‘ఆ ఇల్లు ఆయన ఆలోచనలకు పుట్టిల్లు’’ -వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న గురజాడ నివాసం ఇప్పుడెలా ఉంది?
ప్రజలు మాట్లాడే భాషలోనే సాహిత్యం ఉండాలని చెప్పిన వ్యక్తి జ్ఞాపకాలను పదిల పరచుకున్న ఆ ఇల్లు ఇప్పుడు స్మారక గ్రంథాలయంగా మారింది. అక్కడ ఆయన జీవిత విశేషాలను భద్ర పరిచి ప్రదర్శనకు ఉంచారు.
ఆరుతరాల అరుదైన ఉమ్మడి కుటుంబం: రోజుకు బస్తా బియ్యం, పండగొస్తే 2 పొట్టేళ్లు, 20 కేజీల చికెన్.. కలిసిమెలిసి ఎలా జీవనం సాగిస్తున్నారంటే..
అనంతపురం జిల్లాలో 83 మంది ఒకే ఇంట్లో కలిసిమెలిసి జీవిస్తున్న అరుదైన ఉమ్మడి కుటుంబం కథ ఇది. రోజుకు 50 కేజీల బియ్యం వంట, ఆదివారం వస్తే పొట్టేలు కోయాల్సిందే, సరదాగా బజ్జీలు తినాలంటే 15 కేజీల పిండి సిద్ధం చేయాల్సిందే. ఆధునిక కాలంలో ఎలాంటి విభేదాలు లేకుండా వీరంతా ఎలా కలిసి ఉంటున్నారు? ఆ కుటుంబ సభ్యులు ఏం చెబుతున్నారంటే..
గదర్ పార్టీ: భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఈ గ్రూప్‌కు, ఇరాన్‌కు ఉన్న అనుబంధం ఏంటి?
"చాలామంది స్వాతంత్ర్య సమరయోధులు తమ భద్రత కోసం ఇరాన్‌కు వెళ్లి అక్కడి నుంచే పోరాటాన్ని కొనసాగించేవారు. షిరాజ్‌లో జరిగిన ఒక ఎన్కౌంటర్ తర్వాత అంబా ప్రసాద్ తన ఎడమ చేతితోనే రివాల్వర్‌ను పట్టుకుని తనపై దాడి చేసిన వారిని ఎదుర్కొన్నారు’’
తాజ్‌మహల్: ప్రేమకు చిహ్నమా, ముంతాజ్ లాంటి మహిళల ప్రాణ త్యాగాలకు చిహ్నమా?
షాజహాన్ ప్రేమకు ప్రతీకగా దీన్ని నిర్మించినప్పటికీ, మాతృ ఆరోగ్య సంరక్షణకు ప్రతీక అయితే ఇంకా బాగుండేదని మద్రాస్ కొరియర్ పత్రిక రాసింది.
సముద్ర గుప్తుడు: 'ఒళ్లంతా బల్లెం, బాణం, ఈటె, కత్తి, గద, గొడ్డలి గాయాలున్న ఈ రాజు ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు'
‘ఉత్తర భారతంలో తొమ్మిది రాజ్యాలను జయించడానికి సముద్రగుప్తుడు ఎంతో దూరదృష్టితో ఆలోచించాడు. ఈ తొమ్మిదిమంది రాజుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాడు. సైనిక శక్తితో ఈ రాజ్యాలను జయించి, తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. కానీ, దక్షిణాదిన తాను జయించిన 12 రాజ్యాలను మాత్రం విలీనం చేసుకునేందుకు ప్రయత్నించలేదు’
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.























































